Kiran Abbavaram: సినిమా పోతే ఫేక్ క‌లెక్ష‌న్ల పోస్ట‌ర్లు వేసి రుద్దకూడ‌దు

kiran abbavaram talks about fake collection posters

Kiran Abbavaram: సినిమా ఫ్లాప్ అయితే ఫేక్ కలెక్ష‌న్ల పోస్ట‌ర్లు వేసి జ‌నాల‌పై రుద్ద‌కూడ‌ద‌ని అన్నారు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. ఆయ‌న కా సినిమాతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఈ సంద‌ర్భంగా ఫేక్ క‌లెక్ష‌న్ల‌పై ఆయ‌న త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.

“” నేను ఆడియ‌న్స్ ద‌గ్గ‌ర నిజాయ‌తీగా ఉండాల‌ని అనుకుంటున్నా. నేను న‌టించిన సెబాస్టియ‌న్‌తో పాటు రెండు మూడు సినిమాలు పోయాయి. పోయాయంటే పోయాయ్‌. అంతే. దానిని అక్క‌డే వ‌దిలేయాలి. అంతేకానీ ఫేక్ కలెక్ష‌న్ పోస్ట‌ర్లు వేసి హిట్ అని అబ‌ద్ధం చెప్తూ జ‌నాల‌పై రుద్ద‌కూడ‌దు. అది చాలా త‌ప్పు. నేను కూడా అలాగే ఫేక్ పోస్ట‌ర్లు వేసుకోవ‌చ్చు. అలా వేసుకుంటే నాకు మ‌రింత పాపులారిటీ పెరుగుతుంది. లేదా నాకు రెమ్యున‌రేషన్ పెంచుతారు. కానీ నాకు ఆ ఫేక్ బ‌తుకు వ‌ద్దు. నిజాయ‌తీగానే ఉంటాను “” అని తెలిపారు.