Kinnera Mogulaiah: కూలీగా మారిన‌ భీమ్లా నాయ‌క్ గాయ‌కుడు

Kinnera Mogulaiah working as a labour now

Kinnera Mogulaiah: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ సినిమాలోని భీమ్లా నాయ‌క్ టైటిల్ సాంగ్ మొద‌ల‌య్యే ముందు జాన‌ప‌ద గీతం పాడిన కిన్నెర మొగుల‌య్య ఇప్పుడు కూలీగా మారారు. హైద‌రాబాద్‌లోని తుర్క‌యంజాల్‌లో నిర్మాణంలో ఉన్న భ‌వ‌నం వ‌ద్ద మండుటెండ‌లో ఇసుక మోస్తూ కూలీ ప‌నులు చేస్తుండ‌గా స్థానిక మీడియా వ‌ర్గాలు గ‌మ‌నించి ఆయ‌న ఫోటోలు, వీడియోలు తీసారు. తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌శంస‌లు సైతం పొందిన మొగుల‌య్య‌కు ఈ ప‌రిస్థితి రావ‌డానికి కార‌ణం ఏంటి? 2022లో ప‌ద్మ‌శ్రీ అవార్డును అందుకున్న ఆయ‌న‌కు ఈ దుస్థితి ఎందుకు వ‌చ్చింది?

భార‌త రాష్ట్ర స‌మితి ప్ర‌భుత్వ హ‌యాంలో మొగుల‌య్య‌కు నెల నెలా రూ.10.000 వ‌ర‌కు ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించింది. మొగుల‌య్య ఆ డ‌బ్బుతోనే జీవిస్తున్నారు. ఎప్పుడైతే తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చిందో ఆ ఆర్థిక సాయం ఆగిపోయింద‌ట‌. మొగుల‌య్య కుమారుడు ఫిట్స్‌తో బాధ‌ప‌డుతున్నాడు. అత‌ని వైద్యానికి నెల‌కు రూ.7000 ఖ‌ర్చు అవుతోంద‌ట‌. చేసేదేమీ లేక కూలీ ప‌ని చేసుకుంటున్నాన‌ని మొగుల‌య్య మీడియాకు వెల్ల‌డించారు. ప్ర‌భుత్వం కోటి రూపాయ‌ల ఆర్థిక సాయంతో పాటు కొంత భూమిని కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆ హామీల‌ను సాంక్ష‌న్ చేయ‌క‌పోవ‌డం బాధాక‌రం.