Pawan Kalyan: ప‌వ‌న్‌ని ఇమిటేట్ చేసిన బుడ్డోడు.. డైరెక్ట‌ర్ షాక్

Hyderabad: ఓ చిన్న‌పిల్లాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని (pawan kalyan) ఇమిటేట్ చేసిన వీడియో చూసి షాక‌య్యారు డైరెక్ట‌ర్ హరీష్ శంక‌ర్ (harish shankar). ప‌వ‌న్, హ‌రీష్ కాంబినేష‌న్‌లో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ (ustaad bhagat singh) సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా టీజ‌ర్‌ను చూస్తూ గ‌న్ను ప‌ట్టుకుని ఓ బుడ్డోడు ఇమిటేట్ చేస్తున్న వీడియోను ప‌వ‌న్ (pawan kalyan) ఫ్యాన్ ఒక‌రు హ‌రీష్‌కు పంపారు. గురూజీ.. మీరు ఇది చూడాల్సిందే. పిల్ల‌ల్లో కూడా మాస్ ఆడియ‌న్స్ త‌యారవుతున్నారు అని ట్వీట్ చేసారు. దీనికి హ‌రీష్ శంక‌ర్ రిప్లై ఇస్తూ.. కానీ ఇది చాలా రిస్కీ అన్నారు.