Keerthy Suresh: చిరంజీవి కాదు.. విజ‌య్ బెస్ట్ డ్యాన్స‌ర్

Keerthy Suresh says thalapathy vijay is the best dancer

Keerthy Suresh: టాలీవుడ్‌లో ఎవ‌రి డ్యాన్స్ ది బెస్ట్ అంటే మ‌న‌కు ముందుగా గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఆ త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ లిస్ట్‌లో ఉన్నారు. మ‌న తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ కూడా మ‌న హీరోల‌ను ఇత‌ర ఇండ‌స్ట్రీ వారితో అస్స‌లు పోల్చుకోరు. మ‌రీ ముఖ్యంగా త‌మిళ హీరోల‌తో. ఎందుకంటే మ‌న హీరోల‌కు ఉన్న గ్రేస్ వారికి లేదు కాబ‌ట్టి. మ‌న తెలుగు వారికి తెలుగు న‌టీన‌టులే న‌చ్చుతారు. మ‌న వారి త‌ర్వాతే ఎవ‌రైనా.

కీర్తి సురేష్ కూడా ఇలాగే ఆలోచించిన‌ట్లున్నారు. ఆమె త‌మిళ ఇండస్ట్రీకి చెందిన‌వారు. ఈ నేప‌థ్యంలో ఓ ఈవెంట్‌లో కీర్తిని చిరంజీవి ద‌ళ‌ప‌తి విజ‌య్‌ల‌లో ఎవ‌రు బెస్ట్ డ్యాన్స‌ర్ అని అడిగారు. ఇందుకు కీర్తి విజ‌య్ అని చెప్పారు. విజ‌య్ డ్యాన్స్ గురించి యాక్టింగ్ గురించి మ‌నం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అత‌ని వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో మీమ్స్‌గా వైర‌ల్ అవుతుంటాయి. అలాంటిది కీర్తి విజ‌య్‌ని బెస్ట్ డ్యాన్స‌ర్ అని అన్నారు. బ‌హుశా తన‌ది త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ కాబ‌ట్టి త‌మ ఇండ‌స్ట్రీకి చెందిన హీరోకే ఓటెయ్యాల‌నుకున్నారేమో. చిరంజీవి, కీర్తి సురేష్ క‌లిసి భోళా శంక‌ర్ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.