Keerthy suresh: పెళ్లి వార్తలపై స్పందించిన ‘వెన్నెల’!
Hyderabad: నటి కీర్తి సురేష్ (keerthy suresh) తనపై వస్తున్న పెళ్లి వార్తలపై ఎట్టకేలకు స్పందించారు. మొన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి కేవలం తన చిన్ననాటి ఫ్రెండ్ అని ఈ పెళ్లి విషయంలోకి అతన్ని లాగాలనుకోవడం లేదని తెలిపారు. “హా..హా.. ఆ మిస్టరీ మ్యాన్ ఎవరో సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఈసారి నా ఫ్రెండ్‌ని ఇందులోకి లాగకుండా ఉండాల్సింది. మీరు ఇప్పటివరకు ఒక్కసారి కూడా సరిగ్గా కనుక్కోలేకపోయారు” అని ట్వీట్ చేసారు. కీర్తి(keerthy suresh) తన చిన్ననాటి ఫ్రెండ్‌తో ఎప్పటినుంచో రిలేషన్షిప్లో ఉందని, అతన్నే పెళ్లి చేసుకోబోతోందని కోలీవుడ్ వర్గాలు అన్నాయి. ఆ వ్యక్తి పేరు ఫర్హాన్ బిన్ లియక్వాత్. దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇప్పుడు ఇతను బాగా ట్రెండ్ అవుతున్నాడు. ఎందుకంటే.. కీర్తి తన ఇన్‌స్టా స్టోరీలో ఇతని గురించి పోస్ట్ చేసింది. “ఆ ఫీలింగే వేరు. థ్యాంక్యూ సో మచ్ కీర్తి సురేష్ అని” ఫర్హాన్ పోస్ట్ చేసిన స్టోరీని కీర్తి రీపోస్ట్ చేసింది. “థ్యాంక్యూ సో మచ్ డా ఫర్హాన్” అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. దాంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. మొత్తానికి తన పెళ్లి గురించి కీర్తి ఒక క్లారిటీ ఇచ్చేసింది. దసరా సినిమాలో వెన్నెలగా ఆకట్టుకున్న కీర్తి.. ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలి క్యారెక్టర్లో నటిస్తోంది.