Katrina Kaif: కత్రినా కైఫ్‌కి డయాబెటిస్
Katrina Kaif: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ డయాబెటిస్‌తో బాధపడుతున్నారట. ముంబైలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న కత్రినా చేతికి డయాబెటిస్ ప్యాచ్ ఉండటంతో ఫ్యాన్స్ షాకయ్యారు. కత్రినా బాలీవుడ్‌లో అత్యంత ఫిటెస్ట్ హీరోయిన్లలో ఒకరు. అలాంటి కత్రికు డయాబెటిస్ ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ డయాబెటిస్ ప్యాచ్ వల్ల ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్‌ను ట్రాక్ చేసుకోవచ్చు. దీనిని కంటిన్యుయస్ గ్లూకోజ్ మానిటర్ (CGM) పరికరం అని కూడా అంటారు. దీనిని చేతికి అంటించుకుంటే రోజంతా శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్‌ని ట్రాక్ చేస్తుంది. ఈ ట్రాకింగ్ అంతా మొబైల్ యాప్‌కి వెళ్తుంది. దీనిని ఎప్పటికప్పుడు తీసి కొత్తది అంటించుకోవచ్చు.
ఈ ప్యాచ్ ఎవరు పెట్టుకుంటారు?
టైప్ 1, అడ్వాన్స్‌డ్ డయాబెటిస్‌తో బాధపడేవారు ఈ ప్యాచ్ వేసుకుంటారు. వీరు ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ చూసుకుంటూ పెరిగినప్పుడల్లా ఇన్సులిన్ షాట్స్ తీసుకుంటూ ఉండాలి.