Laxman Utekar: విక్కీ పక్కన భార్యగా కత్రీనా బాగోదు!

Mumbai: బాలీవుడ్​ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal)​, సారా అలీఖాన్(Sara Alikhan)​ జంటగా నటిస్తున్న చిత్రం ‘జరహట్ కే జరబచ్ కే’(Zara Hatke Zara Bachke). మిడిల్​ క్లాస్​ భార్యభర్తల మధ్య జరిగే కథతో రూపొందిన ఈ సినిమా జూన్​ 2న రిలీజ్​ కానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ‘ఎలాగూ విక్కీ కౌశల్, హీరోయిన్ భార్యాభర్తల్లా నటించాలి కదా అలాంటప్పుడు విక్కీకి జంటగా తన భార్య కత్రినాని తీసుకుంటే సరిపోయేది కదా’ అని ఓ విలేఖరి అడిగాడు. అయితే ఈ ప్రశ్నకు డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకార్(laxman utekar) చెప్పిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్​గ మారింది.

‘కత్రినా కైఫ్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకనే చాన్సే లేదు. ఫారెన్ రిటర్న్ అయిన కత్రినా కైఫ్ ఎక్కడైనా ఇండియన్ మిడిల్ క్లాస్ భార్యగా కనిపిస్తుందా? అసలు క్రతినాని చూస్తే మిడిల్ క్లాస్ అమ్మాయిలా కనిపిస్తుందా? అందుకే ఈ సినిమాలో విక్కీ పక్కన కత్రినా కైఫ్ భార్యగా సరిపోదు. పర్సనల్ గా వారిద్దరూ బ్యూటిఫుల్ కపుల్ అయినా ఈ సినిమా కథలో మాత్రం భార్య భర్తల్లా సెట్ అవ్వరు. ఈ సినిమాకి టిపికల్ మిడిల్ క్లాస్ లుక్ ఉన్న అమ్మాయి కావాలని సారా అలీఖాన్ ని సెలక్ట్ చేసుకున్నాను’ అంటూ సమాధానమిచ్చారు డైరెక్టర్​ లక్ష్మణ్​ ఉటేకార్​. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. కత్రీనా, విక్కీ కౌశల్​ పెళ్లి సమయంలోనూ వాళ్లిద్దరి మధ్య ఉన్న వయస్సు తేడా గురించి పలు ట్రోల్స్​ జరిగిన సంగతి తెలిసిందే.