Kartikeya: నేహాతో రొమాన్స్.. ఆ మాట నేను అనలేదు
Hyderabad: అనని మాటలను కూడా అనేసాడు అంటూ టెంప్లేట్స్ వేసేస్తున్న ఓ తెలుగు వెబ్‌సైట్‌పై మండిపడ్డారు నటుడు కార్తికేయ (kartikeya). బెదురులంక సినిమాకు సంబంధించిన ఇచ్చిన ఇంటర్వ్యూ నుంచి ఒక బైట్ తీసి ఓ టెంప్లేట్ వేసాడు. ఆ టెంప్లేట్‌పై “” RX 100తో నాకు రొమాంటిక్ ఇమేజ్ వచ్చింది. DJ టిల్లుతో నేహా శెట్టికి (neha shetty) రొమాంటిక్ ఇమేజ్ వచ్చింది. మా ఇద్దరికీ ఈ ఇమేజ్ రావడం వల్ల మాపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయని బెదురులంకలో (bedurulanka) రొమాంటిక్ సీన్లు పెట్టారు “” అని అన్నట్లు రాసేసారు.
దీనిపై కార్తికేయ క్లారిటీ ఇచ్చారు. అసలు నేహా శెట్టి గురించి రొమాంటిక్ సీన్ల గురించి తాను ఎక్కడా అలా మాట్లాడలేదని అన్నారు. ఇంటర్వ్యూ మొత్తం చూసి అప్పుడు వార్తలు రాస్తే బాగుంటుందని క్లాస్ పీకారు. ఒక నటి లేదా నటుడి ఇమేజ్, సినిమా, వైబ్ మీద దెబ్బకొట్టేలా వార్తలు రాయకూడదని అన్నారు. (kartikeya)