Karishma Kapoor: వేరే వాళ్లతో పడుకోమన్నాడు.. మాజీ భర్తపై సంచలన ఆరోపణలు
Karishma Kapoor: nఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. డబ్బులు ఎక్కువ వస్తే తన భర్త తనను అమ్మేయాలని చూశాడని తెలిపి షాక్ ఇచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్. ఈ అమ్మడు ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. అంతే కాదు ఈ అమ్మడు కరీనా కపూర్ సిస్టర్.
సినీ ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి. ప్రేమలు, బ్రేకప్స్, పెళ్లిళ్లు, విడాకులు ఇక్కడ చాలా కామన్..ఇప్పటికే చాలా మంది పెళ్లి పీటలెక్కి సంతోషంగా ఉంటే కొంతమంది విడాకులు తీసుకొని ఇంకా హ్యాపీగా గడిపేస్తున్నారు. బాలీవుడ్ లో ఈ టైప్ వ్యవహారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. డబ్బులు ఎక్కువ వస్తే తన భర్త తనను అమ్మేయాలని చూశాడని తెలిపి షాక్ ఇచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్.
కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయం లోనే ఆవిడ హీరో అజయ్ దేవగణ్‌తో పీకల్లోతు ప్రేమాయణంను నడిపించింది. కాకపోతే అది వర్కౌట్ కాలేదు. ఆపై అభిషేక్ బచ్చన్ ను ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్.. రాణీముఖర్జీతో ప్రేమాయణం నడిపాడు. కానీ అది కూడా కుదరలేదు. ఫైనల్ గా ఐశ్వర్యారాయ్ ను పెళ్లాడాడు అభిషేక్. ఆ తర్వాత కరిష్మా కపూర్..ఢిల్లీకి చెందిన బిజినెస్ మ్యాన్ సంజయ్‌ను పెళ్లాడింది. వీరి వివాహం 2003లో జరిగింది. (Karishma Kapoor)
ఆయనతో పెళ్లి జరిగాక కూడా కరీష్మా కెరీర్ ను బాగానే కొనసాగించింది. అంతేకాదు వీరికి ఇద్దరు బిడ్డలు కూడా. కొంతకాలానికి సంజయ్ తో కూడా మనస్పర్థలు వచ్చాయి.వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2014లో విడాకులకు అప్లై చేశారు 2016లో విడాకులు మంజూరు అయ్యాయి. అప్పటి నుంచి కరిష్మా సోలోగానే ఉంటుంది. తాజాగా కరిష్మా వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలకు సంబందించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
భర్త సంజయ్ కపూర్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత కరీష్మా కపూర్ తన వైవాహిక జీవితం గురించి ఎన్నో షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మరోసారి దీనిపై కరీష్మా స్పందించింది. ‘పెళ్లైన నాటి నుంచే సంజయ్ నన్ను చిత్ర హింసలకు గురి చేశాడు. నాపై శారీరకంగా దాడి చేశాడు. మానసికంగా హింసించాడు’ అని చెప్పింది.
‘పెళ్లైన తర్వాత సంజయ్ నన్ను హనీమూన్ కోసం తీసుకెళ్లాడు. అక్కడకు తన స్నేహితులను కూడా తీసుకు వచ్చాడు. అప్పుడు వాళ్ల ముందు నన్ను నిల్చోబెట్టి వేలం వేశాడు. ఎవరు ఎక్కువ డబ్బు కోట్ చేస్తారో వాళ్లకు ఇస్తానని చెప్పాడు. ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేని ఓ చేదు జ్ఞాపకం’ అని ఆవేదన వ్యక్తం చేసింది.
కరీష్మా కంటిన్యూ చేస్తూ.. ‘వేలం తర్వాత తన స్నేహితులతో శృంగారం చేయమని సంజయ్ నన్ను బలవంత పెట్టాడు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. నాతో పెళ్లి తర్వాత కూడా తన మొదటి భార్యతో సంజయ్ ఎఫైర్ కంటిన్యూ చేశాడు. ఇది తెలిసి ఎదురు తిరిగితే నాపై దాడి చేశాడు. అతడి మదర్ కూడా నన్ను చిత్ర హింసలు పెట్టింది’ అంటూ వివరించింది.