Kareena Kapoor: పిల్లల కోసమే సైఫ్‌ని పెళ్లి చేసుకున్నా
Kareena Kapoor: పిల్లల కోసమే సైఫ్ అలీ ఖాన్‌ను (saif ali khan) పెళ్లి చేసుకున్నానని అన్నారు కరీనా కపూర్. షాహిద్ కపూర్‌తో (shahid kapoor) కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న కరీనా ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఆ తర్వాత కరీనా జీవితంలోకి తనకంటే పదేళ్లు పెద్దవాడైన సైఫ్ అలీ ఖాన్ వచ్చాడు. సైఫ్ కరీనా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు సహజీవనం చేసారు.
ఆ తర్వాత ఎవ్వరికీ చెప్పకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకున్నారు. కరీనా సైఫ్‌ల వివాహం బిగ్గెస్ట్ సెలబ్రిటీ ఈవెంట్‌గా మారింది. ఇప్పుడు వీరికి ఇద్దరు కుమారులు. అయితే ఎందుకు ఐదేళ్ల సహజీవనం తర్వాత పెళ్లి చేసుకున్నారు అని కరీనాను అడగ్గా.. పిల్లల కోసమే అని చెప్పారు. పెళ్లి కాకుండా పిల్లల్ని కంటే సమాజం ఊరుకోదు కాబట్టి పెళ్లి చేసుకున్నామని లేదంటే సహజీవనంలోనే ఉండేవాళ్లమని పేర్కొన్నారు.
తన జీవితంలో భర్త, పిల్లలు, కుటుంబం, ఐదుగురు స్నేహితులు మాత్రమే ఉన్నారని వారే తన ప్రపంచం అని తెలిపారు. అందుకే ఎక్కువగా పార్టీలకు వెళ్లనని.. తన ప్రపంచంలో ఉన్నవారితోనే జీవితాన్ని గడపాలని అనుకుంటున్నానని వెల్లడించారు. (kareena kapoor)