Darshan: నేను హ‌త్య చేయ‌లేదు.. కానీ హ‌త్య చేస్తుంటే చూసాను

kannada actor darshan shocking statement regarding renuka swamy murder

Darshan: ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు ద‌ర్శ‌న్ తూగుదీప‌.. అభిమాని హ‌త్య కేసులో అరెస్ట్ అయ్యాడు. ద‌ర్శ‌న్‌కు వీరాభిమాని అయిన రేణుకా స్వామి కొన్ని నెల‌ల క్రితం ద‌ర్శ‌న్ స్నేహితురాలైన ప‌విత్ర గౌడ‌కు అస‌భ్య‌క‌ర‌మైన సందేశాలు పంపుతుండేవాడు. ప‌విత్ర గౌడ వ‌ల్ల ద‌ర్శ‌న్‌కు అత‌ని భార్య విజ‌య‌ల‌క్ష్మి మ‌ధ్య గొడ‌వ‌లు వ‌స్తున్నాయ‌న్న ఉద్దేశంతోనే రేణుక స్వామి ప‌విత్ర గౌడ‌కు మెసేజ్‌లు పంపాడు. ఈ విష‌యం ద‌ర్శ‌న్‌కు తెలీడంతో అత‌న్ని హ‌త్య చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈరోజు క‌ర్ణాట‌క పోలీసులు ద‌ర్శ‌న్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఒక‌సారి క‌ల‌వాలి అని రేణుక స్వామిని న‌మ్మించి బెంగ‌ళూరుకు ర‌మ్మ‌ని చెప్పి అత‌న్ని చావ‌బాది చంపేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాత శ‌వాన్ని ఓ కాలువ‌లో పడేసి వెళ్లిపోయార‌ట‌. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌న్ పోలీసుల‌కు షాకింగ్ వాంగ్మూలం ఇచ్చారు. తాను రేణుక స్వామిని చంపలేద‌ని.. కానీ చంపేట‌ప్పుడు మాత్రం ప‌క్కనే ఉండి చూసాన‌ని అన్నారు. ఈ కేసులో భాగంగా ద‌ర్శ‌న్, పవిత్ర గౌడ‌ల‌తో పాటు మ‌రో 13 మంది అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈరోజు సాయంత్రం 4:30కు కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.