Kanguva: సూర్య కొత్త సినిమా టైటిల్ అర్థం తెలుసా!
Chennai: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటిస్తున్న తాజా చిత్రం ‘Suriya42’అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫిక్షనల్ కథతో రూపొందుతున్నఈ సినిమాకు తాజాగా టైటిల్ ఖరారు చేశారు. దర్శకుడు శివ(Shiva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కంగువ(Kanguva) అనే టైటిల్ ప్రకటిస్తూ టీజర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ఇండియా మూవీగా విడుదల కానుంది. పది భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు సరికొత్త టైటిల్‌ను ఎంచుకున్నారు. ఈ టైటిల్ భిన్నంగా ఉండటంతో దీనికి అర్థమేంటో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు నెటిజన్లు.
పాన్ ఇండియా మూవీగా రానున్న సూర్య 42 మూవీకి కంగువ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సినిమాలో సూర్య పాత్ర అల్టిమేట్‌గా ఉంటుందని.. అందుకే ఈ సినిమాకు ఈ పవర్‌ఫుల్ టైటిల్‌ను లాక్ చేసినట్లు సమాచారం. కంగువ అంటే ‘గంగ’ అని అర్థం. టైటిల్ ఎంపికలో ఇంత శ్రద్ధ తీసుకున్న చిత్రబృందం సినిమా మేకింగ్‌లో ఎన్ని సర్ప్రైజ్లతో అభిమానులను అలరించనుందో అర్థమవుతోంది. ఇక, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిషా పటానీ(Disha Patani) హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమాను హిందీలోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్‌ను ప్రముఖ ఆడియో కంపెనీ సరిగమ సౌత్ (SAREGAMA South) భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది.