Kangana Ranaut: పెళ్లి కార్డులు పంచిన కంగ‌న‌!

Mumbai: బాలీవుడ్ క్వీన్ కంగ‌న ర‌నౌత్ (kangana ranaut) మీడియా ప్ర‌తినిధుల‌కు పెళ్లి కార్డులు పంచిపెట్టారు. దాంతో కంగ‌న పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్త‌లు వ‌చ్చేసాయి. ఆ త‌ర్వాత ఆమె అస‌లు విష‌యం చెప్పారు. కంగ‌న మ‌ణిక‌ర్ణిక ఫిలింస్ పేరుతో ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ను స్థాపించింది. త‌న ప్రొడ‌క్ష‌న్ హౌజ్ నుంచి టికు వెడ్స్ షెరు అనే మొద‌టి సినిమా రాబోతోంది. ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవ‌బోతోంది. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా కంగ‌న త‌న క్రియేటివిటీని బ‌య‌ట‌పెట్టారు. కంగ‌న కారులో వ‌చ్చి మీడియా వారికి వెడ్డింగ్ కార్డులు ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేస్తారు. పెళ్లి చేసుకుంటున్నారా కంగ‌న అని అడిగితే.. మీ మీడియా వాళ్లు రూమ‌ర్స్ చెప్తుంటారు కానీ నేను మాత్రం గుడ్ న్యూస్ మాత్ర‌మే చెప్తుంటాను అంటూ తన కొత్త సినిమాను అనౌన్స్ చేసారు. టికు వెడ్స్ షెరు సినిమాలో న‌వాజుద్దిన్ సిద్ధిఖి అవ్‌నీత్ కౌర్ జంట‌గా న‌టించారు.