Kangana Ranaut: ఆ క‌ర్మ ఇప్పుడు నేను అనుభ‌విస్తున్నా

Kangana Ranaut says karma hitted her back

Kangana Ranaut: న‌టిగా ఉన్నప్పుడు త‌న‌కు ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో మంచి గ‌ది కావాల‌ని నిర్మాత‌ల‌ను డిమాండ్ చేస్తూ వారిని విసిగించే దానిన‌ని.. ఇప్పుడు అది త‌న‌కే త‌గులుతోంద‌ని అన్నారు బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్. ఇప్పుడు నిర్మాత‌గా మారి త‌న సినిమాలు తానే నిర్మించుకుంటున్న కంగ‌న‌కు.. త‌న సినిమాలో న‌టించే ఇత‌ర న‌టీన‌టుల నుంచి అలాంటి డిమాండ్సే వ‌స్తున్నాయ‌ట‌. దాంతో చేసిన పాపం ఊరికే పోదు అన్న‌ట్లు.. క‌ర్మ త‌న‌ను కూడా వ‌దిలిపెట్ట‌లేద‌ని అంటున్నారు.

ఎమ‌ర్జెన్సీ సినిమాతో కంగ‌న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఈ శుక్ర‌వారం సినిమా రిలీజ్ కానుంది. దివంగ‌త నేత ఇందిరా గాంధీ విధించిన ఎమ‌ర్జెన్సీ ఎపిసోడ్ ఆధారంగా ఈ సినిమాను తీసారు. ఇందులో కంగ‌న ఇందిరా గాంధీ పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాకు కంగ‌నే నిర్మాత‌. అయితే ఎమ‌ర్జెన్సీ సినిమాలో న‌టించిన వారు ఫైవ్ స్టార్ హోట‌ల్స్‌లో గ‌దులు కావాల‌ని డిమాండ్ చేస్తుండ‌డంతో.. గ‌తంలో తాను నిర్మాత‌లను ఎలా విసిగించానో త‌న‌నూ ఇప్పుడు అలాగే విసిగిస్తున్నారు అని బోధ‌ప‌డింద‌ని.. అయినప్ప‌టికీ తన మ‌న‌సు మంచిదే అని కంగ‌న తెలిపారు.