Kangana Ranaut: సుశాంత్ చావుకు కార‌ణం వారే అని అంద‌రికీ తెలుసు

Mumbai: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput) చావుకు కార‌ణం ఎవ‌రో అంద‌రికీ తెలుస‌ని అన్నారు బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ (kangana ranaut). ఇన్‌డైరెక్ట్‌గా నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌ (karan johar), ర‌ణ్‌బీర్ కపూర్ల‌ను (ranbir kapoor) ఉద్దేశిస్తూ మ‌రోసారి షాకింగ్ కామెంట్స్ చేసారు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. మూడు రోజుల క్రితం రామాయ‌ణాన్ని (Ramayana) తీయాల‌నుకుంటున్నాన‌ని అందులో రాముడిగా ర‌ణ్‌బీర్ క‌పూర్‌ని, సీత‌గా ఆలియా భ‌ట్‌ని (alia bhatt) పెట్టాల‌నుకుంటున్నాన‌ని ద‌ర్శ‌కుడు నితీష్ తివారీ ప్ర‌క‌టించారు. ఇందులో రావ‌ణాసురుడి పాత్ర‌లో క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ య‌ష్‌ని (yash) పెట్టాల‌నుకుంటున్న‌ట్లు తెలిపారు. దాంతో కంగ‌న ఈ సినిమాపై స్పందించారు.

తెల్ల ఎలుక‌లా ఉండే ర‌ణ్‌బీర్ రాముడేంటి, క‌ష్ట‌ప‌డి పైకొచ్చిన న‌టుడు య‌ష్ రావ‌ణాసురుడు ఏంటి అని మండిప‌డ్డారు. కంగ‌న ఈ కామెంట్ పెట్టిన మ‌రుస‌టి రోజు క‌ర‌ణ్ జోహార్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సెల్ఫీ పోస్ట్ చేసారు. దాంతో మ‌ళ్లీ కంగన తన కామెంట్స్‌ను కంటిన్యూ చేసారు. ర‌ణ్‌బీర్ దుర్యోధ‌నుడు అయితే క‌ర‌ణ్ శ‌కునిమామ అని అన్నారు. వీరిద్ద‌రూ క‌లిసి చేసే పీఆర్ పనులు ఏలా ఉంటాయో అంద‌రికీ తెలుస‌ని, సుశాంత్ గురించి త‌ప్పుడు వార్త‌లు రాయించి అత‌ని చావుకి కార‌ణం వీరే అని అంద‌రికీ తెలుస‌ని మండిప‌డ్డారు. త‌న గురించి కూడా ద‌రిద్ర‌మైన రూమ‌ర్స్ రాయిస్తున్నార‌ని, ఒక‌ప్పుడు వారి వ‌ల్ల త‌న కెరీర్ చాలా దారుణంగా అయిపోంద‌ని పేర్కొన్నారు కంగ‌న‌.