Kangana Ranaut: లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ?

2024 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో (lok sabha elections) బాలీవుడ్ క్వీన్ కంగ‌నా రనౌత్ (kangana ranaut) పోటీ చేసే అవ‌కాశం ఉంది. కంగ‌న న‌టించిన చంద్ర‌ముఖి 2, తేజస్ సినిమాలు అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఆమె ద్వార‌కాదీషుని ఆల‌యానికి వెళ్లారు. అక్క‌డ స్వామివారిని ద‌ర్శించుకున్న అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ద్వార‌కాదీశుని ఆశీస్సులు ఉంటే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని కంగ‌న వెల్ల‌డించారు. అయితే ఆమె ఏ పార్టీలో చేర‌తారు అనేదానిపై సందేహం కూడా అవ‌స‌రం లేదు. ఎందుకంటే కంగ‌న ముందు నుంచీ BJPకే స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చారు. ఇప్పుడు కూడా BJP ఆమెకు లోక్ స‌భ ఎన్నిక‌ల్లో స‌పోర్ట్ చేస్తే పోటీ చేసే అవ‌కాశం ఉంది.