Kamal Haasan నిర్మాణంలో తలైవా సినిమా!

Abu Dhabi: యూనివర్సల్​ స్టార్​ కమల్​ హాసన్(Kamal Haasan)​ ఓ వైపు నటుడిగా రాణిస్తూనే నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్​కమల్​ ప్రొడక్షన్స్​ పేరున సొంత బ్యానర్​పై పలు సినిమాలు నిర్మిస్తున్న కమల్​ తాజాగా ఓ అదిరిపోయే వార్త చెప్పారు. ప్రస్తుతం ‘ఇండియన్ 2′(Indian 2) చిత్రీకరణలో బిజీగా ఉన్న కమల్ హాసన్.. ఇటీవలే IIFA 2023 ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇచ్చిన కమల్​ చాలా విషయాలు పంచుకున్నారు.

ఓ ఇంటర్వ్యూలో రజనీ కాంత్(Rajinikanth) సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల జరిగిన కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం గురించి, అబుదాబిలో ఉండటం గురించి తన అభిప్రాయాలను పంచుకున్న కమల్ హాసన్.. తాను నటించబోయే భారతీయుడు 2 మూవీపైనా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే రజనీ కాంత్ సినిమాను నిర్మించడంపై చర్చలు జరిగాయన్నది వాస్తవవమేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

కమల్​ నిర్మాతగా తలైవా హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘విక్రమ్’ డైరెక్టర్​ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం వహించనున్నారని, అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తారని తెలుస్తోంది. కమల్​ ప్రస్తుతం ఇండియన్ 2తో పాటు సేనాపతి సినిమాలోనూ నటిస్తున్నారు. రజినీ కూడా జైలర్​, లాల్​ సలామ్​ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇద్దరి చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా ప్రారంభం కానుంది.