Project K: విలన్​గా యూనివర్సల్​ స్టార్​​!

Hyderabad: యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న మోస్ట్​ అవెయిటెడ్​ సినిమా ప్రాజెక్ట్​ కె(Project-K). మహానటి సినిమాతో వండర్​ఫుల్​​ డైరెక్టర్​గా పేరు తెచ్చుకున్న నాగ్​ అశ్విన్(Nag Ashwin)​ దర్శకుడిగా ఈ సినిమా రూపొందుతోంది.​ వైజయంతీ మూవీస్​, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్​ ప్రముఖ నటుడు అమితాబ్​ బచ్చన్(Amitab Bachchan)​ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్​కి జోడీగా దీపికా పదుకొణె(Deepika Padukone), దిశా పటానీ(Disha Patani) కనిపించనున్నారు. ఈ సినిమాతో దీపిక టాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వనుంది. కాగా, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా నుంచి అప్​డేట్​ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించిన ఓ న్యూస్​ ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

ఈ సినిమాలో ప్రభాస్​కి విలన్​గా యూనివర్సల్ స్టార్​ కమల్​ హాసన్​ని ఎంచుకుందట చిత్రబృందం. ఈ విషయంపై మేకర్స్​ కమల్​ని కలిసి మాట్లాడటం, భారీ మొత్తం ఆఫర్​ చేయడం కూడా జరిగిందట. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు మేకర్స్​. ఈ వార్త నిజమైతే ప్రాజెక్ట్​‌‌ కె అంచనాలను మించి ఉంటుందని సంబరపడిపోతున్నారు ప్రభాస్​ అభిమానులు.