Kamal Haasan: AI కోర్సులో చేరిన కమల్
Kamal Haasan: ఇప్పుడు ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే నడుస్తోంది. విద్యార్థులు కూడా మూస పద్ధతిలో కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. టెక్ ఉద్యోగులకు, విద్యార్థులకు తప్పనిసరిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పట్టు ఉండాలి. కానీ నటుడు కమల్ హాసన్ ఈ కోర్సును నేర్చుకుంటున్నారట. అమెరికాలో 90 రోజుల AI కోర్సులో ఆయన ఎన్రోల్ అయ్యారు. ఇందుకోసం ఈరోజు ఆయన అమెరికా బయలుదేరారు. సినిమా రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకెళ్తోంది. కమల్లో ఓ దర్శకుడు కూడా ఉన్నాడు. ఈ కోర్సు నేర్చుకుని ఆ నైపుణ్యాలను తన సినిమాల్లో ఎలా వాడాలో తెలుసుకునేందుకు కమల్ ఈ కోర్సు చదువుతున్నారట.