Kalki Koechlin: సింపుల్ బ్రేకప్ టిప్.. వేరే వ్యక్తితో పడుకున్నాను అని చెప్పండి
Kalki Koechlin: బాలీవుడ్ నటి కల్కి కొచిలిన్ రిలేషన్షిప్స్ గురించి బ్రేకప్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్‌ను కల్కి వివాహం చేసుకుని కొన్ని నెలలకే విడిపోయారు. పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ చేసిన సినిమాల ద్వారా కల్కి బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే ఓ ఇంటర్వ్యూలో కల్కి బ్రేకప్స్ గురించి మాట్లాడారు. ప్రేమించడం కంటే బ్రేకప్ చెప్పడం చాలా కష్టమని అన్నారు. ఓసారి తన బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పాలనుకున్నానని.. కానీ ఏం చెప్తే తను వింటాడో తెలీలేదని అన్నారు. రెండు మూడు కథలు చెప్పి బ్రేకప్ చెప్పడానికి ప్రయత్నించింది కానీ అతను బ్రేకప్‌కి ఒప్పుకోలేదట. దాంతో తాను వేరొకరితో సెక్స్ చేసాను అని చెప్పడంతో వెంటనే ఆ అబ్బాయి గుడ్‌బై చెప్పేసాడట. ఈ ఘటన చిన్న వయసులో జరిగిందని.. ఎవరైనా బ్రేకప్ చెప్పేయాలని దృఢంగా నిర్ణయించుకుంటే ఈ టిప్ ఫాలో అయిపోతే ఆ మనిషి మళ్లీ మన జీవితంలోకి రాడని అంటున్నారు.
ప్రస్తుతం ఇజ్రాయెల్‌కి చెందిన పియానిస్ట్ గయ్ హెర్ష్‌బర్గ్‌తో రిలేషన్షిప్లో ఉన్న కల్కి అతనితో ఓ బిడ్డను కూడా కనింది. త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే ఒకానొక సమయంలో తాను చాలా మందితో ఒకేసారి రిలేషన్షిప్లో ఉన్నట్లు వెల్లడించారు. ఇలాంటి విషయాలన్నీ ధైర్యంగా ఇంటర్వ్యూలో వెల్లడించిన కల్కి పట్ల సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడున్న సమాజంలో అసలు ప్రేమ అంటే ఏంటో కూడా తెలీడం లేదని.. టైంపాస్ రిలేషన్షిప్స్ నడుస్తున్న ఈ కాలంలో ఇలాంటి ఐడియాలు ఇచ్చి ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు అంటూ మండిపడుతున్నారు.