Kalki: ఇదేమన్నా ఆదిపురుష్ అనుకున్నారా…?
Kalki: సలార్‌తో (salaar) విధ్వంసం సృష్టించిన ప్రభాస్ (prabhas) ఇక కల్కి సినిమాతో ఏ రేంజ్‌లో కనిపించబోతున్నారా అని ఫ్యాన్స్ ఊపిరి బిగ్గపట్టి ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ (nag ashwin) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా VFXపై ఎక్కువ ఆధారపడి ఉంది. VFX అంటే అల్లాటప్పా VFX కాదు. దాదాపు పదేళ్ల పాటు రీసెర్చ్ చేసి అవెంజర్స్, అవతార్ రేంజ్‌తో సినిమా డిజైన్ ఉండబోతోందట. ఈ విషయాన్ని కల్కికి VFX ఎడిటర్‌గా పనిచేస్తున్న విశాల్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్ చాట్ సెషన్‌లో తెలిపారు. కల్కి ఎంత వరకు వచ్చింది అని ఫ్యాన్స్ అడగ్గా.. మాకు పదేళ్లు పట్టింది ఈ పై రీసెర్చ్ చేయడానికి. అవతార్, అవెంజర్స్ రేంజ్‌లో సినిమా ఉండబోతోంది. ఇది ఆదిపురుష్‌లా కాదు అని ఓం రౌత్ తీసిన కళాఖండంపై సెటైర్ వేసారు.