Mukesh Khanna: క‌ల్కి సినిమాలో అన్నీ త‌ప్పులే

kalki 2898 ad distorted facts says Mukesh Khanna

Mukesh Khanna: నాగ్ అశ్విన్ తీసిన క‌ల్కి 2898 ఏడి సినిమా చాలా గ్రాండ్‌గా ఉంద‌ని అన్నారు ప్ర‌ముఖ హిందీ నటుడు ముఖేష్ ఖ‌న్నా. ముఖేష్ మ‌హాభార‌తం సీరియ‌ల్‌లో భీష్ముడి పాత్ర‌లో న‌టించారు. ఈ నేప‌థ్యంలో క‌ల్కి సినిమాలో అన్నీ త‌ప్పులే చూపించార‌ని ఆయ‌న అన్నారు.

అశ్వ‌త్థామ నుంచి కృష్ణుడు మ‌ణిని తీసుకోడ‌ని.. మ‌ణిని తీసుకునేది ద్రౌప‌ది అని తెలిపారు. కానీ సినిమాలో మాత్రం ఆ మణిని కృష్ణుడు తీసుకున్న‌ట్లు చూపించార‌ని అది చాలా త‌ప్ప‌ని అన్నారు. అర్జునుడికి అశ్వ‌త్థామ‌కు మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుంటే.. ఆ యుద్ధాన్ని రివ‌ర్స్ చేసే ప‌వ‌ర్ కేవ‌లం అర్జునుడి మాత్ర‌మే ఉంద‌ని దాంతో అశ్వత్థామ ఏమీ చేయ‌లేక అభిమ‌న్యుడి భార్య వైపు బ్ర‌హ్మాస్త్రం విసురుతాడ‌ని తెలిపారు. అభిమ‌న్యుడి భార్య‌ను కృష్ణుడు 9 నెల‌లు కాపాడింది కేవ‌లం ఆమె గ‌ర్భ‌వ‌తి అని.. ఇవ‌న్నీ చూపించ‌కుండా క‌ల్కి రూపంలో తాను అవ‌తారం ఎత్తిన‌ప్పుడు త‌న‌ను ర‌క్షించ‌మ‌ని కృష్ణుడు అశ్వ‌త్థామ‌ను అడ‌గ‌టం ఏంటి అని ప్ర‌శ్నించారు.

బ్ర‌హ్మాండంలో కృష్ణుడి అంత‌టి మొన‌గాడు మ‌రొక‌రు లేర‌ని చెప్తుంటారని.. అలాంటిది త‌న‌ను కాపాడ‌మ‌ని అశ్వ‌త్థామ‌ను కోర‌డం ఏంటో త‌న‌కు అర్థంకావ‌డంలేద‌ని తెలిపారు. ఏదో సినిమాలో సీన్స్ పెట్టేసి విజిల్స్ కోసం మ‌హాభార‌తాన్ని మార్చడం చాలా త‌ప్పని అభిప్రాయ‌ప‌డ్డారు.