Kajal Aggarwal: పోలీస్​ ఆఫీసర్​గా కొత్త సినిమా!

Hyderabad: దక్షిణాదిన సక్సెస్​ఫుల్​ హీరోయిన్​గా నటించిన భామ కాజల్​ అగర్వాల్(Kajal Aggarwal)​. దాదాపు అందరు స్టార్​ హీరోలతో నటించిన కాజల్​ టాలీవుడ్​ చందమామగా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. టాప్​ హీరోయిన్​గా రాణించిన కాజల్​ ఇటీవలే పెళ్లి చేసుకుని ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు. పెళ్లి, ప్రెగ్నెన్సీతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమైన కాజల్​ మళ్లీ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు.

బాలయ్య(Balakrishna), అనిల్​ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్లో రూపొందుతున్న NBK108తో పాటు, కమల్​ హాసన్​(Kamal Haasan), శంకర్(Shankar)​ కాంబినేషన్లో రూపొందుతున్న ఇండియన్​ 2(Indian 2)లోనూ కాజల్​ నటిస్తోంది. సెకండ్​ ఇన్నింగ్స్ లోనూ వరుస ఆఫర్లు అందుకుంటున్న కాజల్​ తాజాగా మరో సినిమా ఓకే చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్​ శశికిరణ్​ తిక్కా(Shasi kiran Tikka) దర్శకత్వంలో పోలీస్​ ఆఫీసర్​గా ఓ పవర్​ఫుల్​ పాత్రలో నటించనుందని సమాచారం.

మేజర్(Major) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు శశి కిరణ్ తిక్కా. ఆ ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్నారు. 26/11 ముంబై బాంబు దాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ సినిమాను తెరకెక్కించారు శశి. ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్‌బాబు నిర్మాతగా వ్యవహరించారు.
మేజర్ వంటి భారీ హిట్ తర్వాత శశి కిరణ్‌ ఏ సినిమాను ప్రకటించలేదు. అంతేకాదు, ఎవరితో సినిమా చేస్తున్నారు, ఏ జోనర్ సినిమా చేస్తారు అనే విషయాలు కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే, తాజాగా ఆయన ఒక కథను రాశారని, అయితే వేరే వాళ్లు దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా కాజల్​తో ఈ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. మరి పోలీస్​ ఆఫీసర్​గా చందమామ ఎలా మెప్పిస్తుందో చూడాలి.