Kabzaa2: డిజాస్టర్​ సినిమాకి సీక్వెల్​!

Karnataka: శాండల్​వుడ్​ హీరో ఉపేంద్ర(Upendra) నటించిన తాజా సినిమా కబ్జ(Kabzaa). భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ సినిమాలో ఉపేంద్రతో పాటు హీరో సుదీప్(Sudeep) కూడా నటించారు. ఇక ఈ సినిమాను దర్శకుడు చంద్రు డైరెక్ట్ చేయగా, పీరియాడిక్ మూవీగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించారు.  పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్ కాగా, ఈ సినిమాను కన్నడతో పాటు మిగతా భాషల్లోనూ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. తాజాగా సీక్వెల్ షూటింగ్​ స్టార్ట్​ చేసినట్టు డైరెక్టర్​ సోషల్​ మీడియా ద్వారా తెలిపారు.

కబ్జ సినిమా సీక్వెల్​గా కబ్జ 2 సినిమాని ప్రారంభిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సీక్వెల్ మూవీని కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలిపింది. కాగా, ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్(Shiva Rajkumar) కూడా ఓ కేమియో పాత్రలో నటిస్తున్నారు. అందాల భామ శ్రియా సరన్(Shriya Saran) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోండగా, కేజీయఫ్ ఫేం రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మరి కబ్జ-2 అయినా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.