JR NTR: ‘దేవర’ డెడికేషన్​ అలాంటిది!

Hyderabad: యంగ్​ టైగర్​ ఎన్టీఆర్(Jr NTR)​ నటిస్తున్న తాజా చిత్రం దేవర(Devara). కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆర్​ఆర్​ఆర్(RRR)​ తర్వాత దాదాపు ఏడాది గ్యాప్​ తర్వాత తారక్​ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా, ఇటీవల ఎన్టీఆర్​ బర్త్​డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ రివీల్​ చేశారు మేకర్స్​.​ ‘దేవర’ అంటూ అదిరిపోయే ఫస్ట్​లుక్​ని విడుదల చేశారు. ఈ లుక్​ చూసిన నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఒక్క పోస్టర్​తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ సినిమాలో తారక్​కు జోడీగా బాలీవుడ్​ బ్యూటీ జాన్వీ కపూర్(Jahnavi Kapoor)​ నటిస్తోంది. కాగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్​ చాలా కష్టపడుతున్నారు. తాజాగా ఆయన వర్కౌట్స్​ చేస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి. ఈ ఫొటోలు చూసిన అభిమానులు ‘దేవర డెడికేషన్​ అలాంటిది’ అంటూ కామెంట్​ చేస్తున్నారు.

ఇక, దేవర నెక్ట్స్​ షెడ్యూల్​కి కాస్త సమయం ఉండటంతో ఫ్యామిలీతో కలిసి వెకేషన్​కి వెళ్లారు ఎన్టీఆర్​. ఆదివారం సాయంత్రం ఎయిర్​పోర్ట్​లో ఎన్టీఆర్​ కుటుంబంతో సహా కెమెరా కంటికి చిక్కారు. మిని వెకేషన్​ కోసం తారక్​ యూరప్​ వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, తారక్​ తిరిగి రాగానే దేవర తదుపరి షెడ్యూల్​ ప్రారంభం కానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.