War 2: హైప్‌తో చంపేసేలా ఉన్నారు..!

Hyderabad: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) వార్-2 (war 2) సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. హృతిక్ రోష‌న్‌తో (hrithik roshan) క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు అన‌గానే సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. వార్-2లో తార‌క్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో యాక్ట్ చేయ‌బోతున్నార‌ట‌. ఎప్పుడూ చూడ‌ని విధంగా యాక్ష‌న్ సీక్వెన్స్‌లు ఉండ‌బోతున్నాయ‌ని డైరెక్ట‌ర్ అయాన్ ముఖ‌ర్జీ (ayan mukherjee) హింట్ ఇచ్చేసారు. ఇక ఇందులో కియారా అడ్వాణీ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే 2025 రిప‌బ్లిక్ డేకి సినిమా రిలీజ్ అవుతుంది.