Jr NTR: లక్ష్మీ ప్రణతి చీర అంత ఖరీదా..!

Hyderabad: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (jr ntr) లక్ష్మీ ప్రణతిల (lakshmi pranathi) వివాహం 2011 మే 5న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. చూడుముచ్చటగా ఉండే ఈ జంటకు ఇద్దరు కుమారులు. అభయ్ రామ్ భార్గవ్ రామ్. అయితే ఇప్పుడు లక్ష్మీ ప్రణతికి (lakshmi pranathi) సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి సమయంలో లక్ష్మీ ప్రణతి కట్టుకున్న చీర విలువ తెలిస్తే షాక్ అవుతారు. ఆ చీర విలువ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోటి రూపాయలు అట.ఎందుకంటే ఆ చీర మొత్తం బంగారంతో తయారు చేశారంట. అంతేకాదు వీరిద్దరి పెళ్లికి అయిన ఖర్చు ఏకంగా 100 కోట్లు అని తెలుస్తోంది. అఫ్ కోర్స్ పెళ్లి కూడా అంతే గ్రాండ్‌గా చేశారనుకోండి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఆ పెళ్లి మండపం డిజైన్ చేయడానికి అయిన ఖర్చు 18 కోట్లు. పెళ్లి వేడుకకు ఏకంగా మూడు వేల మంది సెలబ్రిటీలు అతిథులుగా విచ్చేసారు.. ఇక ఎన్టీఆర్ (jr ntr) పెళ్లి అంటే మామూలుగా ఉండదు కదా..ఏకంగా 12 వేల మంది ఫ్యాన్స్ వచ్చారు. పెళ్లి వేడుకను దగ్గరుండి కళ్యాణ్ రామ్ (kalyan ram) ఎంతో ఘనంగా జరిపించారు.