JR NTR: ఆ 30 నిమిషాలు పూనకాలే.. ఆ ఒక్క సీన్ నాకు నచ్చలేదు
JR NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర ట్రైలర్ వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను తారక్ ముంబైలో లాంచ్ చేసారు. ఈ సందర్భంగా తారక్, కరణ్ జోహార్, కొరటాల శివ, సైఫ్ అలీ ఖాన్‌ను మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తారక్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
దేవర సినిమా మొత్తంలో చివరి 30 నిమిషాలు పూనకాలే అంటూ ఆయన చెప్పడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. సినిమాలో సొర చేపతో ఫైట్ హైలైట్‌గా నిలిచింది అని యాంకర్ అనగా.. దీనికి తారక్ స్పందిస్తూ.. తనకు నచ్చని సీన్ అదొక్కటే అని అన్నారు. ఎందుకంటే ఆ షార్క్ ఫైట్‌కే ఒక రోజంతా పట్టిందని ఎన్ని టేకులు చేసినా సరిగ్గా కుదరలేదని అన్నారు. అంత కష్టపడ్డాను కాబట్టే ఆ సీన్ బాగా వచ్చిందని తెలిపారు.
కొరటాల శివ గారూ.. మీరు గతంలో కూడా తారక్‌తో కలిసి జనతా గ్యారేజ్ సినిమా కోసం పనిచేసారు. ఇంతటి పెద్ద స్టార్ ఇంత సింపుల్‌గా ఎలా ఉంటారు సర్?
కొరటాల శివ: నాక్కూడా అదే అర్థం కావడంలేదు. తారక్‌లో ఉన్న బెస్ట్ క్వాలిటీ అదే.
సైఫ్ అలీ ఖాన్ గారూ.. ఇది మీకు తొలి సినిమా. తారక్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
సైఫ్ అలీ ఖాన్ : నాకు తెలుగు భాష కొత్త. కాస్త భయపడ్డాను. కానీ తారక్ చాలా సాయం చేసాడు. అతని కళ్లల్లో చూస్తూ డైలాగ్ చెప్పడం కూడా కాస్త కష్టం అయ్యేది. కానీ నాకు సెట్స్‌లో లభించిన సపోర్ట్ అంతా ఇంతా కాదు. నాకు తెలిసి రాబోయే రోజుల్లో ఇక అన్ని భాషల వారు తెలుగు సినిమా నటీనటులతో కలిసి పనిచేయాల్సిందే.
జాన్వి కపూర్‌తో ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగా పలికించారు. బాలీవుడ్ వారు కూడా జాన్విని ఇంత బాగా చూపించలేదు. మీకు జాన్వి తారక్ పెయిర్ ఎలా అనిపించింది?
కొరటాల శివ: ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి జంట బాగుండేది అనేవారు. ఇప్పుడు తారక్ జాన్వి కపూర్ పెయిర్ బాగుంది అంటున్నారు.