Jr NTR: జాన్వి సరిగ్గా చూసుకోలేదు.. తిండి కూడా పెట్టలేదు
Jr NTR: దేవర ప్రమోషన్స్‌లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్, జాన్వి కపూర్ ప్రముఖ హిందీ కామెడీ షో అయిన ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొన్నారు. ఆ సమయంలో తారక్ జాన్విపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. జాన్వి హైదరాబాద్‌కి వచ్చినప్పుడు తన ఇంట్లో స్పెషల్‌గా ఫుడ్ వండించి మరీ పంపానని.. కానీ తాను ముంబైకి వస్తే ఏమీ వండి పెట్టలేదని అన్నారు. తాను హోటల్‌లో ఉంటే కనీసం ఫుడ్ కూడా పంపలేదని సరదాగా ఆటపట్టించారు. దీనిని బట్టి చూస్తే జాన్వికి అతిథులను ఎలా చూసుకోవాలో తెలీదని.. తనకి కావాల్సింది మాత్రం తానే వండుకుని తింటుందని అనడంతో అంతా ఫక్కున నవ్వుకున్నారు. మొన్న శుక్రవారం రిలీజ్ అయిన దేవర ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.