JR NTR: నన్ను సినిమాకు పరిచయం చేసిన మహానుభావుడిని మర్చిపోలేను
JR NTR: ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు మరణం పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. తనను నిన్ను చూడాలని సినిమాతో చిత్ర సీమకు పరిచయం చేసింది రామోజీ రావే అని.. ఆ మహానుభావుడిని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.
“” శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను“” అని తెలిపారు.