Jr NTR: ఆ ఆస్కార్ లిస్ట్‌లో తార‌క్..!

NTR on oscar list: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) అరుదైన గౌర‌వాన్ని ద‌క్కించుకున్నారు. ఆస్కార్ (oscar) యాక్ట‌ర్స్ బ్రాంచ్ స‌భ్యుడిగా స్థానం ద‌క్కించుకున్నారు. ఈ విష‌యాన్ని అకాడెమీ అవార్డ్స్ (ampas) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించింది. తార‌క్‌తో పాటు మ‌రో ఐదుగురు హాలీవుడ్ న‌టుల పేర్లను కూడా లిస్ట్‌లో చేర్చింది.

“” ఇలాంటి టాలెంట్ ఉన్న న‌టులు ఏ క‌థ ఇచ్చినా కూడా వాటిని ఎంతో రియ‌లిస్టిక్‌గా ప్రేక్ష‌కుల‌కు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు న‌టించి చూపిస్తారు. ముఖ క‌వ‌ళిక‌లు, బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ స్కిల్స్‌తో మ‌న‌ల్ని మ‌నం మ‌ర్చిపోయేలా మెస్మ‌రైజ్ చేస్తారు. ఇలా చేస్తేనే క‌థ‌లు నిజం కాక‌పోయినా అవి నిజంగానే క‌ళ్ల ముందు జ‌రుగుతున్నాయేమో అనిపిస్తుంది “” అని అకాడ‌మీ అవార్డ్స్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొంది. (jr ntr)