JR NTR: మాట నిలబెట్టుకున్న తారక్
JR NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కొరటాల శివ (koratala siva) డైరెక్షన్‌లో తారక్ నటిస్తున్న దేవర (devara) సినిమా దాదాపు అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తారక్ కేవలం తెలుగులో మాత్రమే తన వాయిస్‌లో మాత్రమే డబ్బింగ్ చెప్తూ వస్తున్నారు. కానీ ఈసారి దేవర సినిమాకు గానూ మలయాళంలోనూ తన వాయిస్‌తో డబ్బింగ్ చెప్పనున్నారు. అయితే మొత్తం సినిమాకు ఆయన డబ్బింగ్ చెప్పరు కానీ.. దేవర గ్లింప్స్ మలయాళ వెర్షన్‌కు మాత్రం తారక్ డబ్బింగ్ చెప్పారు.
ఇలాంటి ప్రయత్నం చేసిన ఏకైక టాలీవుడ్ స్టార్ తారకే కావడం విశేషం. తారక్ తెలుగులో ఎంత స్పష్టంగా మాట్లాడతారో మలయాళంలోనూ అంతే స్పష్టంగా డైలాగులు చెప్పడంపై మల్లు అభిమానులు కూడా తారక్‌కు ఫిదా అయిపోయారు. RRR సినిమా ప్రమోషన్స్ సమయంలో అన్ని భాషల్లో తాను డబ్బింగ్ చెప్పారు. కానీ మలయాళ వెర్షన్ మాత్రం మిస్ అయ్యారు. అప్పుడే తారక్ మల్లు ఫ్యాన్స్‌కి తన తర్వాతి సినిమాతో తప్పకుండా మలయాళంలో డబ్బింగ్ చెప్తానని ప్రామిస్ చేసారు. ఆ ప్రామిస్‌ను మొత్తానికి నిలబెట్టుకున్నారు.