Devara: యాక్ట‌ర్.. డైరెక్ట‌ర్.. ఎడిట‌ర్..!

jr ntr is taking care of direction and editing as well for devara

Devara: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (Jr NTR) దేవ‌ర సినిమాతో ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టేయాల‌ని ఫిక్స్ అయిపోయారు. అర‌వింద స‌మేత వీర రాఘ‌వ త‌ర్వాత తారక్ నుంచి రాబోతున్న సోలో సినిమా ఇది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. దాంతో ఈ సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు.

సినిమా ఫ్యాన్స్‌కి త‌ప్ప‌కుండా న‌చ్చి తీరాల్సిందే అన్న డెడికేష‌న్‌లో తార‌క్ ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఎప్పుడూ న‌ట‌న వ‌ర‌కే త‌న‌ని తాను ప‌రిమితం చేసుకున్న తార‌క్ ఇప్పుడు దేవ‌ర సినిమా కోసం డైరెక్ట‌న్ డిపార్ట్‌మెంట్‌తో పాటు ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌ని కూడా ద‌గ్గ‌రుండి ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఎడిటింగ్ విష‌యంలో ఏమ‌న్నా మార్పులు చేర్పులు ఉంటే తార‌క్ ద‌గ్గ‌రుండి చేయిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నెల 20న తార‌క్ పుట్టిన‌రోజు కావ‌డంతో దేవ‌ర నుంచి ఓ కొత్త పోస్ట‌ర్ రిలీజ్ కానుంది. దీంతో పాటు ఆయ‌న బాలీవుడ్‌లో చేస్తున్న తొలి సినిమా వార్ 2కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా రాబోతోంద‌ని టాక్.