Jr NTR: అంటే నేను బోన‌స్‌గా దొరికానా..?

Hyderabad: యంగ్ టైగ‌ర్  Jr NTR సెన్స్ ఆఫ్ హ్యూమ‌ర్ గురించి ఫ్యాన్స్‌ అంద‌రికీ తెలిసిందేగా..! రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ (jr ntr)హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో క‌నిపించారు. బ‌హుశా షూటింగ్ కోసం వేరే ప్ర‌దేశానికి వెళ్తున్నట్లున్నారు. ఆ స‌మ‌యంలో ఒక తెలుగు ఫొటోగ్రాఫ‌ర్ అక్క‌డే ఉన్నారు. ఆయ‌న ఎన్టీఆర్‌ను చూడగానే వీడియోలు, ఫొటోలు తీసారు. అప్పుడు ఎన్టీఆర్ ఆయ‌న్ను ప‌ల‌కించార‌ట‌. నేను ర్యాప‌ర్ బాద్‌షా కోసం ఎయిర్‌పోర్ట్‌కి వ‌చ్చాను స‌ర్ అని ఎన్టీఆర్‌తో అన్నార‌ట‌. అందుకు తార‌క్ స్పందిస్తూ.. అంటే నేను నీకు బోన‌స్‌గా దొరికా అన‌మాట అంటూ ఫ‌న్నీ రిప్లై ఇచ్చార‌ట‌. ఈ విష‌యాన్ని ఆ ఫొటోగ్రాఫ‌ర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తార‌క్ అలా మాట్లాడ‌టం ఎంతో న‌చ్చింద‌ని అన్నారు. ఇక‌పోతే ఎయిర్‌పోర్ట్‌కి వ‌చ్చిన‌ప్పుడు NTR వేసుకున్న బ్యాగ్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అది ప్ర‌ముఖ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్ లూయీ విట్టోన్‌కు చెందిన బ్యాగ్. దాని ధ‌ర అక్ష‌రాలా రూ.6 ల‌క్ష‌లు. ఇక వ‌ర్క్ విష‌యానికొస్తే.. తారక్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న దేవ‌ర (devara) సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.