NTR: మీకు ఎప్పుడూ రుణపడి ఉంటా!
Hyderabad: యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) శనివారం (మే 20న) తన 40 వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ఎన్టీఆర్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక, ఒకరోజు ముందే కొరటాల శివ(Koratala Siva) ఎన్టీఆర్ 30(NTR30) నుంచి టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసి అభిమానులకు అదిరిపోయే బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత తారక్(Tarak) నటిస్తున్న సినిమాకు దేవర(Devara) అనే పవర్ఫుల్ టైటిల్‌ని ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. నిన్ను చూడాలనితో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తారక్ ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. పుట్టినరోజు శుభాకాంక్షలతోపాటు దేవర పోస్టర్‌ను అభినందించిన అభిమానులు, ప్రముఖులకు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ విడుదల చేశారు ఎన్టీఆర్.
‘గత కొన్ని దశాబ్దాలుగా నా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఆ సమయంలో నా అభిమానులే నాకు అండగా నిలిచారు. నేను పోషించిన ప్రతి పాత్ర, నేను భాగమైన ప్రతి కథ నా అభిమానుల కోసమే. నాకు సపోర్ట్ గా నిలిచి, నేను చేసే ప్రతి కథను, ప్రతి పాత్రను ఆదరిస్తున్నందుకు, నిత్యం నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు.. విధేయతకు ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక దేవర పోస్టర్ కు మీరిచ్చిన స్పందన అద్భుతమైనది. దానికి మీకెప్పుడూ కృతజ్ఞుడను. అది నా పుట్టినరోజును మరింత స్పెషల్ గా చేసింది. ఈ రోజును మరింత ప్రత్యేకంగా మార్చినందుకు నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు మరియు తోటి సినీ సహోదర సభ్యులకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను’ అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు తారక్. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ‘మేమెప్పుడూ.. మీ వెంటే ఉంటాం’ అంటూ కామెంట్ చేస్తున్నారు.