JR NTR: తారక్ గ్యారేజ్‌లో చేరిన మరో లగ్జరీ కారు!
JR NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్యారేజ్‌లోకి కొత్త లగ్జరీ కారు వచ్చి చేరింది. మెర్సిడీస్ బెంజ్ మేబ్యాక్ ఎస్ క్లాస్ ఎస్ 580 కారును తారక్ కొనుగోలు చేసారు. ఈరోజే తారక్‌కు కారు డెలివరీ చేసారు. దీని ధర దాదాపు రూ.2.5 కోట్లు ఉంటుంది. తారక్‌కు కార్లంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆయన దగ్గర సూపర్ కార్ల నుంచి ఎస్‌యూవీల వరకు అన్నీ ఉన్నాయి.
తారక్ దగ్గరున్న కార్లు ఇవే..!
2021 ఆగస్ట్‌లో తారక్ లంబోర్గిని ఉరుస్ కారును కొనుగోలు చేసారు. దీని ధర రూ.3.16 కోట్లు. ఈ కారుకు రూ.17 లక్షలు పెట్టి 9999 సంఖ్య వచ్చేలా నెంబర్ ప్లేట్ కూడా తీసుకున్నారు.
తారక్ వద్ద మర్సిడీస్ బెంజ్ GLS 350d కూడా ఉంది. దీని ధర రూ.81 లక్షలు.
ఎన్టీఆర్ గ్యారేజ్‌లో 1.85 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్ ఉంది. దీనికి కూడా 9999 రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ ఉంది.
BMW 7 సిరీస్ కూడా ఉంది. రూ.1.70 కోట్ల విలువైన ఈ కారుకు కూడా 9999 నెంబర్ ప్లేట్ ఉంది.
పోర్షే 718 కేమ్యాన్ కారు కూడా తారక్ సొంతం చేసుకున్నారు. దీని ధర రూ. 2.54 కోట్లు