Jr NTR: వైర‌ల్ అవుతున్న తార‌క్ బ‌ర్త్‌డే పార్టీ పిక్స్!

Hyderabad: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(jr ntr) బ‌ర్త్‌డే పార్టీ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ నెల 20న తార‌క్(jr ntr) త‌న 40వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్నారు. నిన్న హైద‌రాబాద్‌లోని త‌న ఇంట్లో ఫ్రెండ్స్‌కి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా తార‌క్ దిగిన పిక్స్ వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఇత‌ర కార‌ణాల వ‌ల్ల త‌న తాత‌గారి శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌కు రాలేక‌పోతున్నానని అప్ప‌టికే తార‌క్ ప్ర‌క‌టించేసారు. కానీ ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్న‌ప్పుడు ఒక్క‌సారి శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌కు వ‌చ్చి రెండు మాట‌లు మాట్లాడి వెళ్లిపోయినా బాగుండేద‌ని ఫిలిం క్రిటిక్స్ అంటున్నారు. ఎటూ హైద‌రాబాద్‌లోనే ఉన్న‌ప్పుడు ఈవెంట్‌కి హాజ‌రుకాక‌పోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌పోతే బ‌ర్త్‌డే సంద‌ర్భంగా తార‌క్ న‌టిస్తున్న త‌న 30వ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసేసారు. దేవ‌ర(devara) టైటిల్‌తో కొరటాల శివ(koratala siva) డైరెక్ట్ చేస్తున్నారు. జాన్వి క‌పూర్(janhvi kapoor) హీరోయిన్. సైఫ్ అలీ ఖాన్(saif ali khan) విల‌న్‌గా న‌టిస్తున్నారు.