JR NTR: అట్లీ ఒక లైన్ చెప్పాడు.. అదిరిపోయింది

JR NTR about film with atlee

JR NTR:  దేవ‌ర సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ చెన్నైలో సంద‌డి చేసారు. ఈ సంద‌ర్భంగా త‌మిళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఒక్క ఫ్లాప్ లేని ద‌ర్శ‌కుడైన అట్లీ గురించి తార‌క్ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేసారు. ఓసారి అనుకోకుండా అట్లీని క‌లిసిన‌ప్పుడు ఒక క‌థ‌లోని లైన్ చెప్పాడ‌ని.. అది చాలా బాగుంద‌ని అన్నారు. ఒక రొమాంటిక్ కామెడీ క‌థ కూడా త‌న‌తో డిస్క‌స్ చేసాడ‌ని.. ఇప్పుడు ఇద్ద‌రూ త‌మ సినిమాల‌తో బిజీగా ఉన్నాం కాబ‌ట్టి భ‌విష్య‌త్తులో త‌ప్ప‌కుండా సినిమా చేస్తామ‌ని వెల్ల‌డించారు. అట్లీ తీసిన రాజా రాణి సినిమా త‌న‌కు చాలా ఇష్ట‌మని.. ఒక చ‌క్క‌టి ల‌వ్ స్టోరీని ఇలా కూడా చెప్ప‌చ్చా అనిపించింద‌ని అన‌డంతో త‌మిళ మీడియా సంతోషంతో కేక‌లు వేసారు.