OTTలోకి జియో.. ఒకేసారి 100 సినిమాలు!

Hyderabad: కరోనా(Corona) తర్వాత ఓటీటీ(OTT)లకు ఆదరణ బాగా పెరిగింది. థియేటర్స్​ కంటే ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో సినిమాలు చూసేందుకే మొగ్గు చూపుతున్నారు మూవీ లవర్స్. అందుకే దిగ్గజ సంస్థ జియో(Jio) కూడా ఓటిటి రంగంలోకి అడుగుపెట్టింది. ఎంట్రీ తోనే ఏకంగా 100 స్టోరీస్ ని ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో ఓటిటి(OTT) ట్రెండ్ నడుస్తుంది. థియేటర్ లో సినిమాలు చూడడాని కంటే ఇంటిలో కూర్చొని ఓటిటి సినిమాలు చూసేందుకు ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్ మంచి ప్రేక్షక ఆదరణ పొందాయి. కేవలం సినిమాలతోనే కాదు వెబ్ సిరీస్, టాక్ షోస్, సింగింగ్ అండ్ రియాలిటీ షోస్ తో ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. ఇక ఓటిటి కంటెంట్ పై సినీ ప్రియులు చూపిస్తున్న ఆసక్తిని గమనించిన అంబానీ జియో స్టూడియోస్ (Jio Studios) అంటూ ఒక కొత్త ఓటిటి(OTT) ప్లాట్‌ఫార్మ్ తీసుకు వస్తున్నారు.

ఈ ఓటిటి లాంచ్ ఈవెంట్ బుధవారం ఏప్రిల్​ 12న ముంబై లో జరిగింది. ఈ ఈవెంట్ లో బాలీవుడ్ అండ్ సౌత్ స్టార్స్ హాజరై సందడి చేశారు. లాంచింగ్ తోనే 100 స్టోరీస్ ప్రకటించి సంచలనం సృష్టించారు జియో నిర్వాహకులు. ఇతర నిర్మాణ సంస్థలు నిర్మించిన సినిమాలను జియో స్టూడియోస్ కొనుగోలు చేసి ప్రసారం చేయడంతో పాటు.. సొంత నిర్మాణంలో కూడా సినిమాలు నిర్మించనుంది. అలాగే ఒరిజినల్ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వస్తామంటూ తెలియజేసింది. హిందీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, భోజపురి మరియు సౌత్ భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్ నిర్మించనున్నారు.