Jeevitha rajasekhar: పెళ్లికాకుండానే వాళ్లింట్లో పెట్టుకున్నారు
Hyderabad: రాజశేఖర్ (rajasekhar) జీవిత(jeevitha) అన్యోన్య దంపతులు అనే పదానికి కేరాఫ్ అడ్రెస్ అని చెప్పచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ(jeevitha rajasekhar) ఎప్పటికప్పుడు తమకి ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వెల్లబుచ్చడంలో వెనుకాడరు. ఇటీవల అలా మొదలైంది అనే టాక్‌షోలో వీరిద్దరూ సందడి చేసారు. తన ప్రేమ, పెళ్లికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
“నేను రాజశేఖర్‌గారు కలిసి వరుసగా దాదాపు 7 సినిమాల్లో నటించాం. మా పెయిర్ అంటే అప్పట్లో ఓ క్రేజ్ ఉండేది. బహుశా అందుకేనేమో మాకూ ఒకరిపై ఒకరికి ప్రేమ పుట్టింది. మేం ప్రేమలో ఉన్న విషయాన్ని కూడా దాచాలని అనుకోలేదు. రాజశేఖర్ గారి సినిమా షూటింగ్‌కు నేను కూడా వెళ్లేదాన్ని. కానీ మా పెళ్లి జరగదు అని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే రాజశేఖర్ సినిమాల్లోకి రావడం వాళ్లింట్లో ఇష్టం లేదు. అయినా అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయి వారిని ఒప్పించారు. అప్పట్లోనే వాళ్ల అమ్మ సినిమా అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని ఒట్టు వేయించుకున్నారు. దాంతో మా పెళ్లి అవ్వదని అర్థమైపోయింది. అయినా మా ప్రేమను కొనసాగించాలనుకున్నాం”
“ఓ సినిమా షూటింగ్ సమయంలో రాజశేఖర్ గారికి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్‌లో నేనే దగ్గరుండి అన్నీ చూసుకున్నా. అప్పుడు ఆయన అమ్మానాన్నలు వచ్చారు. నేను ఆయన కోసం రోజూ సేవలు చేస్తుంటే నాకన్నా మంచి భార్య ఆయనకు దొరకదు అని వారికి అర్థమైంది. అలా నేను వారికి దగ్గరైపోయాను. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక నన్ను కూడా వారింటికే తీసుకెళ్లారు. అలా పెళ్లికాకుండానే రాజశేఖర్ గారి ఇంట్లో 9 నెలలు ఉన్నాను. అలా పెద్దల అంగీకారంతోనే మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యాం. అప్పట్లో ఆయనకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఓసారి నా ముందే ఓ అమ్మాయి వచ్చి ఆయనకు ముద్దిచ్చేసింది. అదృష్టవంతురాలివి రాజశేఖర్‌ను గెలుచుకున్నావు అనేవారు” అంటూ అప్పటి సంగతులను వెల్లడించారు జీవిత.