Aarti: నన్ను అడగకుండా విడాకులు ప్రకటించేసారు
Aarti: ప్రముఖ తమిళ నటుడు జయం రవి ఇటీవల విడాకుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. చాలా కాలం పాటు ప్రయత్నించిన తర్వాత తాను తన భార్యా ఆర్తితో విడిపోతున్నానని.. ఈ సమయంలో తమకు ప్రైవసీ అవసరం అంటూ పోస్ట్ చేసారు. అయితే ఈ విడాకుల ప్రకటనను తన అనుమతి తీసుకోకుండా జయం రవి ప్రకటించేసారని ఆరోపించారు ఆర్తి. అసలు జయం రవి ఇలా ప్రకటన చేసేస్తారన్న విషయం కూడా తనకు తెలీదని ఆమె మీడియా ద్వారా వెల్లడించారు.
రవితో తాను సామరస్యంగా మాట్లాడేందుకు ఎంతో ప్రయత్నించానని కానీ రవి అందుకు సిద్ధంగా లేడని వెల్లడించారు. విడాకులు ప్రకటించినప్పటి నుంచి తన క్యారెక్టర్‌పై లేని పోని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇలా బయటికి వచ్చి మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. ప్రస్తుతం తన ముందున్న ఏకైక బాధ్యత తన ఇద్దరు పిల్లల సంరక్షణే అని.. వారు తమ నిర్ణయం వల్ల ఎలాంటి బాధ పడకుండా చూసుకునే బాధ్యత తనపై ఉందని తెలిపారు ఆర్తి.