Javed Akhtar: శ్రీదేవి ఎప్పుడైనా ఒక మంచి క్యారెక్ట‌ర్‌లో న‌టించిందా?

javed akhtar shocking comment on sridevi

Javed Akhtar: బాలీవుడ్ సీనియ‌ర్ గేయ ర‌చ‌యిత జావేద్ అక్త‌ర్.. అల‌నాటి తారలైన శ్రీదేవి, మాధురి దీక్షిత్‌ల‌పై షాకింగ్ కామెంట్స్ చేసారు. మాధురి సంగ‌తి అటుంచితే.. మ‌న శ్రీదేవి ఎంత‌టి మంచి సినిమాల్లో త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేసారో మ‌న‌కు తెలుసు. కానీ జావేద్ అక్త‌ర్ మాత్రం ఈ ఇద్ద‌రు న‌టులు త‌మ జీవితంలో ఒక మంచి క్యారెక్ట‌ర్‌లో న‌టించ‌లేక‌పోయార‌ని కామెంట్స్ చేసారు. ఒక‌ప్ప‌టి తార‌లైన న‌ర్గిస్, మ‌ధుబాల లాగే శ్రీదేవి, మాధురిలో చాలా టాలెంట్ ఉంద‌ని కానీ వారి సినీ జీవితంలో ఒక చ‌క్క‌టి పాత్ర‌లో మాత్రం న‌టించ‌లేక‌పోయార‌ని జావేద్ అన‌డం వివాదాస్ప‌దంగా మారింది.