Jailer: రిలీజ్​ డేట్​ ఫిక్స్​.. మెగాస్టార్​తో తలపడనున్న సూప‌ర్‌స్టార్!

Chennai: సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’(Jailer). పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilipkumar) డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్​ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తలైవా అభిమానులు. తాజాగా చిత్రబృందం ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌ను ఓ వీడియో రూపంలో ప్రకటించారు. రజినీకాంత్ స్టైలిష్ లుక్‌తో ఎంట్రీ ఇవ్వగా, ఈ చిత్రాన్ని ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, మోహన్ లాల్, తమన్నా, రమ్యకృష్ణ, సునీల్, జాకీ ష్రాఫ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)నటిస్తోన్న భోళాశంకర్‌ (Bhola Shankar) ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రజినీకాంత్ నటిస్తున్న జైలర్‌ ఆగస్టు 10న విడుదల కానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అంటే ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒక్క రోజు వ్యవధిలోనే బాక్సాఫీస్‌ పోరుకు రెడీ అవుతున్నారు.
వేదాళ‌ం రీమేక్‌గా వస్తోన్న భోళా శంకర్ చిత్రానికి మెహ‌ర్‌ర‌మేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవి సోదరి పాత్రలో కీర్తిసురేశ్‌(Keerthy Suresh) నటిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannah Bhatiya) ఫీ మేల్ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. చిరంజీవి, రజినీకాంత్ సినిమాలకు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో మంచి మార్కెట్‌ ఉంటుంది. మరి మెగాస్టార్, సూపర్ స్టార్ మధ్య పోటీ బాక్సాఫీస్‌ను ఎలా ప్రభావితం చేస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.