Adipurush: ఒళ్లు గగుర్పొడిచేలా ‘జై శ్రీరామ్​’ పాట!

Mumbai: పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్(Prabhas), కృతి సనన్(Kriti Sanon) జంటగా నటించిన సినిమా ఆదిపురుష్(Adipurush)​. బాలీవుడ్​(Bollywood) డైరెక్టర్​ ఓమ్ రౌత్(Om Raut) రూపొందించిన ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా అనౌన్స్​మెంట్​ నుంచి విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు, అప్​డేట్లలో మొట్టమొదటగా ప్రేక్షకులను మెప్పించింది జై శ్రీరామ్(Jai Shri Ram)​ పాట ప్రోమో. ఈ ప్రోమోతోనే సినిమాపై పాజిటివ్​ టాక్​ రావడం ప్రారంభమైంది. ఆ పాజిటివిటీ ట్రైలర్​ రిలీజ్​కి కూడా చాలా హెల్ప్​ అయ్యింది. ప్రోమోతోనే ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిన జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ నేడు రిలీజ్ అయింది.

ఇక, ఈ సినిమా జూన్​ 16న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది.  విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఆదిపురుష్​ చిత్రయూనిట్​ ప్రమోషన్స్​ షురూ చేసింది. ట్రైలర్​ టాక్​తో పుంజుకున్న చిత్రబృందం వరుస పోస్టర్లు, అప్​డేట్లతో అభిమానులను సర్​ప్రైజ్​ చేస్తోంది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ తెచ్చిపెట్టిన జైశ్రీరామ్ తోనే ప్రమోషన్స్​ ప్రారంభించేశారు. ఇప్పటికే ఈ పాట ప్రోమో వచ్చి అందర్నీ మెప్పించింది. తాజాగా నేడు ఈ జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. అంతేకాదు ముంబైలో లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చి ఈవెంట్ నిర్వహించి పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు అజయ్ అతుల్ సంగీతం వహించారు. ఈ లిరికల్ సాంగ్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ లో ఉంది.