చ‌లాకీ చంటికి గుండెపోటు

Hyderabad: జబ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్, ప్ర‌ముఖ న‌టుడు చ‌లాకీ చంటి(chalaki chanti) గుండెపోటుకు గుర‌య్యారు. ఈరోజు ఉద‌యం ఆయ‌న చెస్ట్ పెయిన్ వ‌స్తోంద‌ని చెప్ప‌డంతో వెంట‌నే గ‌చ్చిబౌలిలోని ఓ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించిన‌ట్లు తెలుస్తోంది. గుండెలోని కుడి, ఎడ‌మ వైపుల్లో 95% పూడిక‌లు ఏర్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారట‌. ప‌రిస్థితి కాస్త సీరియ‌స్‌గా ఉంద‌ని స‌మాచారం. జ‌బ‌ర్ద‌స్త్‌లో ఎన్నో స్కిట్ల‌తో ఆడియ‌న్స్‌ను అల‌రించారు చంటి. ప‌లు సినిమాల్లోనూ క‌మెడియ‌న్‌గా పేరుతెచ్చుకున్నారు.