‘ఇస్మార్ట్​’ కాంబో రిపీట్​!

Hyderabad: డైరెక్టర్​ పూరీ జగన్నాథ్​కి చాలా రోజుల తర్వాత కమ్​బ్యాక్​ ఇచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar). ఈ సినిమాతో ఎనర్జిటిక్​ హీరో రామ్(Ram Pothineni)​లోని మాస్​ యాంగిల్​తో ప్రేక్షకులను మెప్పించాడు పూరీ. ఛార్మీ(Charmi)ని నిర్మాతగానూ సక్సెస్​ బాట పట్టించిన సినిమా ఇస్మార్ట్​ శంకర్​. కాగా, ఈ సక్సెస్​ఫుల్​ కాంబో రిపీట్​ అవబోతోందని తెలుస్తోంది. ద వారియర్ డిసాస్టర్ తరవాత బోయపాటి(Boyapati Srinivas)తో పాన్ ఇండియా మూవీ చేస్తున్న రామ్.. తన తదుపరి మూవీ పూరి దర్శకత్వంలోనే చెయనున్నారని టాక్. దీనికి సంబంధించిన స్క్రిప్ట్​ వర్క్​ కూడా పూర్తయ్యిందట. ఈ సినిమాతో మళ్లీ హిట్​ కొట్టాలని చూస్తున్నారట పూరీ.

రౌడీ హీరో విజయ్​ దేవరకొండ హీరోగా పాన్​ ఇండియా లెవల్లో తెరకెక్కిన లైగర్ ఊహించని విధంగా ప్లాప్​ అయ్యింది. ఆ షాక్ నుంచి ఇటు విజయ్​, అటు పూరీ ఇంకా కోలుకోనేలేదు. కాగా, సాలిడ్​ కమ్​బ్యాక్​తో అదరగొట్టాలని పూరీ ప్లాన్​ చెస్తున్నారని తెలుస్తోంది. ఛార్మితో కలిసి ముంబైలో కొన్నాళ్లుగా మకాం వేసిన పూరి జగన్నాథ్ ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ కథని ప్రిపేర్ చేసుకుని డెవెలెప్ చేస్తూ.. రామ్ తో మీటింగ్ మొదలెట్టినట్టు టాక్. పూరి-ఛార్మినే పూరీ కనెక్ట్స్ లో ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నారట.

లైగర్​ షూటింగ్​ సమయంలోనే మొదలు పెట్టిన ‘జన గణ మణ’ సినిమాని పక్కన పెట్టేసిన పూరీ రామ్​తో చేయబోయే సినిమాతో ప్రేక్షకులను మెప్పించి మళ్లీ ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట. మరి పూరీ ప్లాన్​ ఎంతవరకు వర్కౌట్​ అవుతుందో చూడాలి.