Isha Koppikar: ఆ స్టార్ నటుడు నన్ను ఒంటరిగా కలవమన్నాడు
Isha Koppikar: ప్రముఖ బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ సంఘటన గురించి వెల్లడించారు. ఓ నటుడు తనను డ్రైవర్ లేకుండా ఒంటరిగా కారులో రమ్మన్నాడట. అలా రమ్మని చెప్పిన నటుడు ఏ కింది స్థాయి నటుడో కాదు. టాప్ యాక్టరే అట. కానీ పేరు మాత్రం వెల్లడించలేనని ఇషా తెలిపారు.
“” నాకు 18 ఏళ్లు ఉన్నప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చాను. 22 ఏళ్ల వయసున్నప్పుడు బాలీవుడ్‌కి చెందిన ఓ అగ్ర నటుడు నన్ను డ్రైవర్ లేకుండా ఒంటరిగా కారులో తన వద్దకు రావాలని అన్నాడు. పైగా తనపై ఆల్రెడీ చాలా మంది హీరోయిన్లతో తిరుగుతున్నాను అనే రూమర్స్ ఉన్నాయని కూడా చెప్పాను. కానీ నేను అలా ఒంటరిగా రాను అని చెప్పి తప్పించుకున్నాను “” అని తెలిపారు.
నాగార్జున, రమ్యకృష్ణ నటించిన చంద్రలేఖ సినిమాలో ఇషా కొప్పికర్ రెండో హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత హిందీ ఇండస్ట్రీకి వెళ్లిపోయారు.