NTR 30: హింట్ ఇచ్చేసిన తారక్..!

Hyderabad: ఎన్టీఆర్(NTR)​ కొరటాల శివ(Koratala Shiva) కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. NTR 30 అనే వర్కింగ్ టైటిల్​తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్​ని ఇటీవలే ప్రారంభించారు. తాజాగా ఈ సినిమా సెట్స్​లో అడుగుపెట్టిన తారక్(Tarak)​ తన మొదటి షెడ్యూల్​ని కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇంకా టైటిల్​ ఖరారు కాని ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

దాదాపు సంవత్సరం గ్యాప్ తర్వాత సెట్స్ మీదకు వచ్చారు యంగ్ టైగర్. చివరకు రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు కొరటాల. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్(Jahnvi Kapoor) నటిస్తోంది. జాన్వీకి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట.

ఇటీవ‌ల తారక్ “వస్తున్నా(Vastunnaa)” అంటూ ఓ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా టైటిల్ గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్​ అవుతోంది. రీసెంట్‌గా అల్లు అర్జున్ పుట్టిన రోజున బావా అంటూ ఎన్టీఆర్ విషెస్ తెలిపారు. “పార్టీ లేదా పుష్ప” అని అడిగారు. దీనికి అల్లు అర్జున్ బదులిస్తూ ‘వస్తున్నా(Vastunnaa)’ అనేశారు. అయితే ఇప్పుడు ఇదే వస్తున్నా అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం కొరటాల శివ చాలా టైటిల్స్ ప‌రిశీలించారు. రీసెంట్ గా జరిగిన ప్రారంభోత్సవంలో ఆసక్తికర విషయాలు చెప్పారు కొరటాల శివ. మృగాలను వేటాడే మగాడిగా ఎన్టీఆర్ రోల్ ఉంటుందని అన్నారు. దీంతో ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఎన్టీఆర్ 30 కోసం భారీస్థాయిలో సెట్స్ వేయ‌బోతున్నారు. గోవా(Goa), విశాఖపట్నం(Vizag) వంటి ప్రాంతాల్లో యాక్షన్ సీన్స్‌ షూట్ చేయనున్నారు.