ఇది Devara నుంచి లీకైందా?

Hyderabad: యంగ్ టైగ‌ర్ NTR ప్ర‌స్తుతం కొర‌టాల శివ‌తో క‌లిసి దేవ‌ర (devara) సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో శ్రీదేవి కూతురు జాన్వి క‌పూర్ (janhvi kapoor) హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే తార‌క్‌కు (jr ntr) సంబంధించిన ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. చాలా మంది ఇది దేవ‌ర నుంచి లీకైన‌ట్లుంది అని కామెంట్స్ పెడుతున్నారు. మ‌రికొంద‌రేమో ఇది దేవ‌ర సినిమా నుంచి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌తో క్రియేట్ చేసార‌ని అంటున్నారు. కాస్త అలాగే ఉన్న‌ప్ప‌టికీ దేవ‌ర‌లో ఈ స్టిల్ ఉంటే మాత్రం గూస్‌బంప్స్ గ్యారంటీ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దేవ‌ర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ (saif ali khan) విల‌న్‌గా న‌టిస్తున్నారు. 2024 ఏప్రిల్‌న సినిమా (devara) రిలీజ్ అవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.