Prabhas: ఇంట్లోవారు అనుష్కని పెళ్లి చేసుకోమని అంటున్నారా?
ప్రభాస్ (prabhas) అనుష్కల (anushka) జోడీ అంటే ఇష్టపడనివారు ఉండరు. వీరికి ప్రణుష్క (pranushka) అని పేరు పెట్టేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్ పేజెస్ కూడా తెరిచేసారు. ఇప్పుడు ఏఐ ట్రెండింగ్‌లో ఉండటంతో వీరిద్దరికీ పెళ్లి అయిపోయి పిల్లలు ఉన్నట్లు ఫోటోలు కూడా డిజైన్ చేసేస్తున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చూడబోతే ఫ్యాన్సే కాదు.. ప్రభాస్ ఇంట్లో వారు కూడా అదే కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్, అనుష్క మంచి ఫ్రెండ్స్. వారిద్దరూ డేటింగ్‌లో లేరు. కానీ వారిద్దరూ ఆ ఫ్రెండ్‌షిప్‌ని కాస్త పక్కనపెట్టి దానిని ప్రేమగా మార్చుకుని పెళ్లి వరకు తీసుకెళ్తే బాగుంటుందని ప్రభాస్ కుటుంబీకులు అభిప్రాయపడుతున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. దీనిపై ప్రభాస్ అనుష్కలు కూడా తమ కుటుంబీకుల ముందు తమ స్పందనను తెలియజేసారట. ప్రస్తుతానికి ఇద్దరి మధ్య అలాంటి ఆలోచన లేదని మున్ముందు ఏమన్నా జరిగితే అప్పుడు తప్పకుండా ఆలోచిస్తామని చెప్పారట.